ఏపీలో విద్యాశాఖ సీఎం జగన్ సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, పలువురు విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో స్కూళ్ల ప్రారంభంపై సీఎం జగన్ అధికారులతో చర్చించారు. ఆగస్టు 16 నుంచి స్కూళ్లు ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు.
ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ నెల 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్ బుక్స్‌పై టీచర్లకు శిక్షణ ఇవ్వాలన్న ఆయన.. స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం జగన్ సూచించారు.
ఇది కూడా చదవండి: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు