దేశంలో కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు భారత్ లో ఒక్క కేసు నమోదు కాలేదని కేంద్రం స్పష్టం చేసినా.. ప్రజల్లో మాత్రం ఒమిక్రాన్ పై టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణలో స్కూళ్లు బంద్ చేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో యథావిధిగా స్కూళ్లు నడుస్తాయని మంత్రి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సైతం స్కూళ్లు నడపాల్సిందేనని సీఎం చెప్పారని మంత్రి సబితా తెలిపారు. సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని మంత్రి సూచించారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిద్దామన్నారు. విద్యా సంస్థల యాజమాన్యాలు అన్నిరకాల కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని మంత్రి సబితా స్పష్టం చేశారు.