తెలంగాణలో విద్యాసంస్థలు పున:ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మాస్క్ లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని… ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోవాలని…ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, మానవత్వం తో వ్యవహరించాలని ప్రైవేట్ యాజమాన్యాలను కోరుతున్నానని వివరించారు. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు కోవిడ్ ని దృష్టి లో పెట్టుకొని ఏర్పాట్లు చేశామని విద్యా శాఖ మంత్రి పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్ ను దృష్టి లో పెట్టుకునే ప్రత్యక్ష తరగతుల ప్రారంభం చేస్తున్నామని.. ఆఫ్ లైన్ బోధనకు ఆన్లైన్ ప్రత్యామ్నాయం కాదని తెలిపారు. పిల్లలు ఆనందం తో ఉన్నారు.. తల్లి దండ్రులు కూడా పిల్లల్ని పంపేందు కు సుముఖంగా ఉన్నారన్నారు.
ఇక గత ఏడాది ఎక్కువ ఫీజులు వసూలు చేసిన స్కూల్స్ పై చర్యలకు ఉపక్రమిస్తే చాలా స్కూల్స్ దిగి వచ్చాయని…. టీచర్ల హేతుబద్దీకరణ వలన స్కూల్స్ మూత పడడం కానీ, టీచర్ పోస్ట్ లు తగ్గడం కానీ ఉండదని వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు త్వరలోనే నిర్వహిస్తామని… ఒక వేళ స్కూల్స్ లో కోవిడ్ కేసులు వస్తే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే ఆ స్కూల్ కి సెలవులు ప్రకటిస్తామన్నారు. హాస్టల్స్ విషయం లోనే కొద్దిగా ఇబ్బందులు వస్తాయేమోననే ఆందోళన ఉందని తెలిపారు. ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థల్లో పని చేసే టీచర్లు, సిబ్బంది కి వాక్సినేషన్ పూర్తయింది… ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వెంటనే తీసుకోవాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: