తెలంగాణలో విద్యా సంస్థలను పున: ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విద్యాసంస్థల పునఃప్రారంభంపై కూడా కేబినెట్ భేటీలో చర్చించారు. జులై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జులై 1 నుంచి అన్ని రకాల విద్యాసంస్థలను ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. పూర్తిస్థాయి సన్నద్థతతో విద్యాసంస్థలను పున:ప్రారంభించాలని తెలిపింది.
ఇదీ చదవండి: రాసలీలల ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వండి: అభిమానుల వినూత్న నిరసన