తెలంగాణలో కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించింది. ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని పేర్కొంది.
కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, ప్రభుత్వ సన్నద్ధత సహా తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగానే విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని నిర్ణయించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా జనవరి 8 నుంచి 16 వరకు రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఈ సెలవుల్లోనే సంక్రాంతి సెలవులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సెలవుల ముగిసే లోపు కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరిగితే సెలవులు మరిన్ని రోజులు పొడిగించే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital