అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌పై పిలుపునిచ్చిన బంద్ దృష్ట్యా సోమవారం జార్ఖండ్‌లోని పాఠశాలలు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న 9, 11 తరగతుల పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. కొన్ని సంస్థలు పిలుపునిచ్చిన బంద్ దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు సోమవారం మూసివేయాలని నిర్ణయించాం” అని పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం కార్యదర్శి రాజేష్ కుమార్ శర్మ ఆదివారం తెలిపారు.
పాఠశాల విద్యార్థులకు, ముఖ్యంగా బస్సులో ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బిహార్‌లో బస్సుకు నిప్పంటించడంతో విద్యార్థులను బలవంతంగా కిందకి దింపడం వంటి ఘటనలు ఇంతకుముందు జరిగాయి. అందుకే విద్యార్థుల క్షేమం దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అగ్నిపథ్ పథకానికి నిరసనగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) జార్ఖండ్ బంద్‌కు పిలుపునిచ్చింది.