Tuesday, November 19, 2024

వేసవి సెలవుల్లో మార్పు చేసిన ఏపీ సర్కారు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకెళ్తుందనే విమర్శలు వస్తున్నాయి. కరోనా కేసులు ఉన్నా.. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మే 31 వరకు పాఠశాలలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో స్కూళ్లకు మే 15 నుంచి వేసవి సెలవులు ఉంటాయని ప్రకటించగా.. తాజాగా వాటిల్లో మార్పులు చేసింది. 2020-21 విద్యా సంవత్సరంలో భాగంగా ఏప్రిల్ నెలాఖరు నాటికి సిలబస్ పూర్తి చేసి.. మే నెలలో సమ్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటన చేసింది.

కాగా NCERT షెడ్యూల్ ప్రకారం టెన్త్ విద్యార్థులు, టీచర్లకు వేసవి సెలవులు లేవు. 10వ తరగతి విద్యార్థులకు యథావిధిలో జూన్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఎండలు, పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో విద్యార్థులను తరగతులు ముగిసిన తర్వాత పాఠశాల నుంచి క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement