ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు నాడు-నేడు సమీక్షలో సీఎం జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. మొదటి విడత నాడు-నేడు పనులు అదే రోజు ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు. అదేవిధంగా నూతన విద్యా విధానంపై సమగ్రంగా అదే రోజు సర్కార్ వివరించనుంది.
అదే రోజు రెండో విడత నాడు-నేడు పనులకు అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే నూతన విద్యా విధానంపై సమగ్రంగా అదే రోజు ఏపీ ప్రభుత్వం వివరించనుంది. విద్యార్థులకు విద్యా కానుక కిట్లు కూడా వచ్చే నెల 16 నుంచి విద్యాశాఖ అందజేయనుంది. అయితే పాఠశాలల పున : ప్రారంభం నేపథ్యంలో అన్ని కరోనా మహమ్మారి నియమ నిబంధనాలు పాటించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని సీఎం జగన్ సూచించారు.
ఈ వార్త కూడా చదవండి: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రానికి ఆగస్టు 2 వరకు డెడ్‌లైన్