మాతృదేవోభవ, పితృదేవోభవ,ఆచార్యదేవోభవ ఇవి చెప్పుకోవడానికే తప్ప ఎవరు పాటిస్తున్నారు ఈ రోజుల్లో. తల్లిదండ్రులను నిర్థాక్షణ్యంగా రోడ్లపై వదిలివెళ్తున్నారు పలువురు పిల్లలు. ఇక గురువులపై ఉండాల్సిన గౌరవాన్ని మరచిపోతున్నారు నేటి విద్యార్థులు. హిందీ మాస్టర్ పాఠాలు చెబుతుండగా ఆయనపై బకెట్ తో దాడి చేశారు విద్యార్థులు. ఈ సంఘటన కర్ణాటకలోని దావణగెరు జిల్లా చెన్నగిరి తాలూక నల్లూర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోని మరోసారి ఇటువంటివి జరగకుండా చూడాలని కర్ణాటక ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి, పోలీసులకు నెటిజన్లు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. అయితే విద్యార్థులు అంతగా రెచ్చిపోతోన్న ఆ మాస్టారు కాస్తయినా కోపం తెచ్చుకోకపోవడం విశేషం. ఆ మాస్టారు వారి చేష్టలను అంతగా భరిస్తున్నప్పటికీ ఆ విద్యార్థులు ఊరుకోలేదు. చెత్త బకెట్‌ను ఆ ఉపాధ్యాయుడి తలపై పెట్టి వీడియో కూడా తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆ పిల్లలపై చర్యలు తీసుకోవాలని ప్రముఖులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై మీడియా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించగా ఈ ఘటన తమ దృష్టికి రాలేదని చెప్పారు. ఆ విద్యార్థులు హిందీ టీచర్ ప్రకాశ్‌ను గతంలోనూ వేధించినట్లు సమాచారం. తాజాగా వీడియో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. టీచర్‌తో దురుసుగా ప్రవర్తించిన విద్యార్థులకు టీసీ ఇచ్చి పంపించారు. పిల్లలపై పోలీసు కేసు కూడా నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అధికారులు చెప్పారు. కాగా, ఈ విషయం అధికారుల దృష్టికి రావడం, వీడియో వైరల్ కావడంతో హిందీ టీచర్ ప్రకాశ్‌కు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆయనకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందుతున్నట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..