Tuesday, November 26, 2024

మైన‌ర్ విద్యార్థినితో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌.. హెడ్ మాస్ట‌ర్ ని చిత‌క‌బాదిన విద్యార్థినులు

ఓ మైన‌ర్ విద్యార్థి ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు ఓ హెడ్ మాస్ట‌ర్.. దాంతో కోపోద్రిక్తులైన విద్యార్థినులంతా క‌లిసి హెడ్ మాస్ట‌ర్ ని చిత‌క‌బాదారు. ఈ ఘటన కర్ణాటకలో శ్రీరంగపట్నానికి చెందిన కట్టేరి గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కట్టేరి ప్రభుత్వ హై స్కూల్ హెడ్ మాస్టర్‌ చిన్మయ ఆనందమూర్తి ఓ హాస్టల్ స్టూడెంట్‌ (మైనర్ బాలిక)తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె వెంటనే ఇతర రూమ్‌మేట్లకు తెలిపింది. వారందరినీ అలర్ట్ చేసింది. వారంతా కలిసి హెడ్ మాస్టర్‌ను ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యారు.

ఓ వీడియోలో విద్యార్థినులంతా మూకుమ్మడిగా హెడ్ మాస్టర్ పై కర్రలతో దాడి చేశారు. వారి రూమ్ మేట్ ను వేధించినందుకు విరుచుకుపడ్డారు. ఇతర స్కూల్ స్టాఫ్, టీచర్లు వారికి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టు మరో వీడియోలో కనిపించింది. ఆ హెడ్ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకునేలా నిర్ణయాలు తీసుకుంటామని వారు చెబుతున్నారు. హెడ్ మాస్టర్ ఒక క్లాసు రూమ్‌లోకి వెళ్లి దాక్కోవాలని ప్రయత్నించాడు. కానీ, కర్రలతో వెళ్లి ఆ విద్యార్థినులు ఆ చాన్స్ ఇవ్వలేదు. రూమ్‌లోకి దూసుకెళ్లి చితక్కొట్టినట్టు మరో వీడియో చూపించింది. కాగా ఈ హెడ్ మాస్టర్ తరుచూ అనేకరకాల ఉల్లంఘనలకు పాల్పడేవాడని కొందరు అధికారులు చెప్పారు. గతంలోనూ పలువురు బాలికలను వేధించినట్టు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన తీవ్రం కావడంతో పోలీసులు స్పాట్‌కు వెళ్లారు. అతడిని అరెస్టు చేశారు. అతడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారులు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement