సిరిసిల్లలో ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలతో పాటు.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఆధ్వర్యంలో పలువురు వ్యక్తులు సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని కోనరావుపేట మండలం మలకపేట గ్రామంలో స్కూల్ బిల్డింగ్ నిర్మించడానికి ఓ దాత ముందుకొచ్చారు. కోటిన్నర రూపాయలతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఆధునిక భవన నిర్మాణానికి ముందుకు వచ్చారు టీఆర్ఎస్ పార్టీ నేత చల్మెడ లక్ష్మీ నరసింహారావు.
ఈ మేరకు ఆయన శనివారం మంత్రి కేటీఆర్ ని కలిసి బిల్డింగ్ ప్రణాళికలను అందజేశారు. స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి ముందుకొచ్చి.. నిరుపేద విద్యార్థులకు మంచి వసతులు కల్పించే ఆలోచన చేసినందుకు మంత్రి కేటీఆర్ ఆయనను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలన్నారు.