Tuesday, November 26, 2024

India | సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు.. అత్యవసర కేసులకు వెకేషన్​ బెంచ్ రెడీ​!

సుప్రీంకోర్టుకు వేసవి విరామం వచ్చింది. దీంతో పలు కేసులకు సంబంధించిన విషయంలో కీలక నిర్ణయాలపై సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​ డీవై చంద్రచూఢ్ ఆదేశాలు జారీ చేశారు. ​వేసవి విరామ సమయంలో తాజా విషయాలను కూడా సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్‌లు వింటాయని, వివిధ ప్రాంతాల నుంచి న్యాయవాదులు ఆన్‌లైన్‌లో కేసులను వాదించే వెసులుబాటు కల్పిస్తున్నామని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ ఇవ్వాల (మంగళవారం) తెలిపారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

‘‘వెకేషన్ బెంచీల్లో కూర్చున్న నా సోదరులు సెలవుల్లో తాజా విషయాలను వినేందుకు స్పోర్టీవ్​నెస్​తో అంగీకరించారు’’ అని సీజేఐ చంద్రచూఢ్​ తెలిపారు. వేసవి విరామం మే 22 నుండి జులై 2 వరకు ఉండనుంది. ఈ కాలంలో అత్యవసర విషయాలను పరిష్కరించడానికి వెకేషన్ బెంచ్‌లు అందుబాటులో ఉండనున్నాయి.  వెకేషన్ బెంచ్‌ల ముందు 300కి పైగా విషయాలు లిస్ట్ చేస్తారు. వెకేషన్ బెంచ్‌ల ముందు ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన ప్రదేశాల నుండి హాజరై, వాదించాలని కోరుకునే న్యాయవాదులను స్వాగతిస్తున్నట్లు సీజేఐ చంద్రచూఢ్​ తెలిపారు.

‘‘ఆన్​లైన్​లో మరింత సౌకర్యవంతంగా ఎక్కడి నుంచైనా వాదించాలనుకుంటే మీకు స్వాగతం’’ అని సీజేఐ చంద్రచూఢ్​ నేతృత్వంలోని ధర్మాసనం ఇవ్వాల (మంగళవారం) పేర్కొంది. సాధారణంగా.. తాజా కేసులను వెకేషన్ బెంచ్‌లు విచారించవు. ఒక విషయంలో కొంత తక్షణ ఉపశమనం అవసరమైనప్పుడు కానీ, వెకేషన్ బెంచ్ విషయాన్ని వినడానికి అంగీకరించినప్పుడు మాత్రమే తాజా కేసులను తీసుకుంటారు. అయితే, ఈసారి సెలవు బెంచ్‌ల ద్వారా అత్యవసర విషయాలను మాత్రమే వినడం అనే సాధారణ పద్ధతిని తీసుకొచ్చారు.

- Advertisement -

వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే వేసవి సెలవుల్లో కేసుల విచారణకు వెకేషన్ బెంచ్‌ల రాజ్యాంగానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలో నోటిఫికేషన్‌ను జారీ చేసింది. గతేడాది వేసవి విరామం కంటే ఈ ఏడాది వార్షిక వేసవి విరామం ఒక వారం తక్కువగా ఉండటం గమనార్హం. 2022లో వార్షిక వేసవి విరామం ఏడు వారాల పాటు ఉండగా, ఈ సంవత్సరం ఆరు వారాల వేసవి విరామం ఉండనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement