Friday, November 22, 2024

రేప్​ కేసులో ఎమ్మెల్యేకు ఊరట.. వారం రోజులపాటు అరెస్టు చేయొద్దన్న సుప్రీంకోర్టు

రేప్​ కేసులో అరెస్ట్ వారెంట్‌ను ఎదుర్కొంటున్న లోక్ ఇన్సాఫ్ పార్టీ ఎమ్మెల్యే సిమర్జిత్ సింగ్ బెయిన్స్ ను ఒక వారం పాటు అరెస్ట్ చేయవద్దని పంజాబ్ పోలీసులను సుప్రీంకోర్టు ఇవ్వాల ఆదేశించింది. ఓ మహిళ తనను ఎమ్మెల్యే రేప్​ చేశారని ఆరోపించడంతో ఈ కేసు నమోదు అయ్యింది. కాగా ఈ కేసులో పంజాబ్ ప్రభుత్వంతో పాటు, బైన్స్ పై కూడా సుప్రీంకోర్టు చురకలంటించింది.  అత్యాచార ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తర్వాత ఫిర్యాదుదారుపై నాలుగు క్రిమినల్ కేసులు నమోదు కావడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం బెంచ్​ ఈ కేసు విచారణకు సంబంధించి అన్ని చర్యలను ఆపేస్తున్నట్టు తెలిపింది.  తదుపరి విచారణ తేదీలోపు ఈ విషయంలో ప్రత్యుత్తరాలు దాఖలు చేయాలని పంజాబ్ పోలీసులు, బైన్స్, ఫిర్యాదుదారు మహిళను కూడా కోర్టు ఆదేశించింది. కాగా, ఈ కేసు వచ్చే వారం విచారణకు రానున్నట్టు అధికారులు తెలిపారు.

 పంజాబ్‌లోని లూథియానా జిల్లాలోని ఆటమ్ నగర్ అసెంబ్లీ స్థానానికి సిమర్‌జిత్ సింగ్ బైన్స్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అత్యాచారం కేసులో తనపై ట్రయల్ కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్లపై స్టే ఇవ్వకుండా పంజాబ్, హర్యానా ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతను పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి,  ప్రచారం చేయడానికి రిలీఫ్​ కోసం సుప్రీంలో పిటిషన్​ దాఖలు చేయగా.. దీనిని అత్యాచార బాధితురాలి న్యాయవాది వ్యతిరేకించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement