Friday, November 22, 2024

దళిత బంధుపై చల్లారని వేడి.. టీఆర్ఎస్‌లో టెన్షన్

దళిత బంధు పథకం ప్రారంభానికి ముందే వివాదం రాజేసింది. తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పకథం అమలు చేయనున్న వేళ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దళిత బంధుపై రెండు రోజులుగా హుజురాబాద్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దళిత బంధును అర్హులకు ఇవ్వడం లేదంటూ ఆరోపిస్తున్నారు. దళితుల ఆందోళనలతో టీఆర్ఎస్‌లో టెన్షన్ నెలకొంది.

హుజురాబాద్‌లో దళితులు చేపట్టిన రాస్తారోకోతో వరంగల్- కరీంనగర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దళిత బంధు అందరికి ఇవ్వాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో దళితుల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో దళితులు వాగ్వాదానికి దిగారు.

మరోవైపు హుజురాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా దళితులు ఆందోళనకు దిగారు. కరీంనగర్‌లో ముగ్గురు మంత్రులు హరీష్‌ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ లు సమావేశం నిర్వహిస్తున్న సందర్భంగా దళిత బంధుపై ఆందోళనలు చెలరేగడం గమనార్హం. ఈ నెల 16న హుజురాబాద్‌కు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. సీఎం సభ లోపే దళితులు శాంతిస్తారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.

ఇది కూడా చదవండిః దళిత బంధు సభ.. టీచర్లకు జనసమీకరణ బాధ్యత!

Advertisement

తాజా వార్తలు

Advertisement