Friday, November 22, 2024

సీఏఏని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు.. విచారణను మరోసారి వాయిదా వేసిన ధర్మాసనం

పౌరసత్వ (సవరణ) చట్టం 2019ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ల విచారణను సుప్రీంకోర్టు ఇవ్వాల (సోమవారం) వాయిదా వేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 19కి చేపట్టనున్నట్టు తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం వీటిపై విచారణ జరుపుతోంది.  Citizenship Amendment Act, 2019 (CAA)ని సవాలు చేస్తూ దాదాపు 220 పిటిషన్లు దాఖలయ్యాయి. సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు మొదట డిసెంబర్ 18, 2019న సుప్రీంకోర్టులో విచారణకు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement