Tuesday, November 26, 2024

కాన్వాయ్ అపి కరుణచూపిన సబితమ్మ.. చెప్పుల్లేకుండా ఎండలో వెళ్తున్నవిద్యార్థులకు చేయూత

మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉంది.. దానికి తోడు విద్యార్థులు కాళ్లకు చెప్పులు లేకుండా వెళ్తున్నారు. అటు వైపు నుండి వెళ్తున్న విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి కంట పడ్డారు. వెంటనే కాన్వాయ్ ఆపి విద్యార్థులతో మాట్లాడారు. వాళ్లకు మంచి నీళ్ల, చాక్ లెట్లు అందించారు. చెప్పులు లేకుండా వెళ్తున్న విద్యార్థులకు ఏకంగా షూస్​, సాక్స్​ అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

విస్తృత పర్యటన చేసే మంత్రి సబితారెడ్డి శనివారం మధ్యాహ్నం వరకు రంగారెడ్డి కలెక్టరేట్ లో వడ్ల కొనుగోలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తరువాత తన నియోజక వర్గంలో పర్యటనకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మామిడిపల్లి మీదుగా వెళ్తుండగా ఎర్రటి ఎండలో విద్యార్థులు కాళ్లకు చెప్పులు లేకుండా వెళ్తున్న విషయాన్ని చూసి తన కాన్వాయ్ నీ ఆపి విద్యార్థులను తన దగ్గరకు పిలిచి, చెక్లెట్లు, మంచి నీరు అందించి ఆప్యాయంగా మాట్లాడారు. అక్కడి నుండే స్థానిక టి ఆర్ ఎస్ నాయకుడు నిమ్మల నరేందర్ గౌడ్ కు ఫోన్ చేసి వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. దాంతో వెంటనే ఆయన వారికి షూ, సాక్స్ అందించారు. కొన్ని గంటల వ్యవధిలోనే అంతా చక చక జరిగిపోయింది. దీంతో విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మంత్రి సబితారెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement