Friday, November 22, 2024

సర్పంచ్ పదవికి వేలం.. 44.10 లక్షలకు బిడ్డింగ్ చేసి సొంతం చేసుకున్న కాంట్రాక్టర్

గ్రామ సర్పంచ్ పదవికి వేలం వేయడం చాలా గ్రామాల్లో జరుగుతుంది. కానీ, అది ఒకటి రెండు లక్షలు, పది లక్షల లోపు మాత్రమే జరగడం మనకు తెలుసు. కానీ ఓ పంచాయతీ సర్పంచ్ పదవికి ఏకంగా 44.10లక్షలు బిడ్ చేసి ఆ పోస్టు దక్కించుకున్నాడో కాంట్రాక్టర్. ఇది ఒడిశా రాష్ట్రంలో జరిగింది. కాగా, దీనిపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేస్తోంది.

ఒడిశాలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే బలంగీర్ జిల్లాలోని మారుమూల గ్రామ పంచాయతీకి ఫుల్ డిమాండ్ ఉంది. అక్కడి సర్పంచ్ పదవిని రూ.44.10 లక్షలకు వేలం పాటలో గెలుచుకున్నాడు ఓ వ్యక్తి. సోమవారం అక్కడ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఒడిశాలో మూడు అంచెల పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 16 నుంచి 24 వరకు ఐదు దశల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో ఫలితాలు వెల్లడికానున్నాయి.

బలంగీర్ జిల్లాలోని పుయింతలా బ్లాక్‌లోని బిలాయిసర్డ పంచాయతీలో మొన్న జరిగిన గ్రామసభ సమావేశంలో బిలాయిసర్డ, బందనకట , కసుర్‌పలి 3 గ్రామాలకు చెందిన కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలతో సహా ప్రముఖుల సమక్షంలో వేలం జరిగింది. కాగా, నిన్న రాష్ట్రంలో సర్పంచ్‌లు, సమితి సభ్యులు, జిల్లా పరిషత్‌ సభ్యుల పదవులకు నామినేషన్‌ పత్రాల దాఖలు ప్రక్రియ ప్రారంభం కాగానే ఈఊరి సర్పంచ్ కోసం వేలం వేసే ప్రక్రియ తెరపైకి వచ్చింది.

తొలుత నలుగురు అభ్యర్థులు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనగా ఒక బిడ్డర్ రూ.21 లక్షలు కోట్ చేసి కాల్ ప్రారంభించాడు. దీంతో బిడ్డింగ్లో పాల్గొనాల్సిన వారిలో ఇద్దరు విరమించుకున్నారు. చివరగా సర్పంచ్ అభ్యర్థి సుశాంత్ కుమార్ ఛత్రియా, వృత్తిరీత్యా కాంట్రాక్టర్ తను 44, 10,000 రూపాయలతో అత్యధిక బిడ్డర్‌గా నిలిచాడు. జగన్నాథ ఆలయ అభివృద్ధికి మరో రూ. 44,000 విరాళం ఇస్తానని అదే మొత్తాన్ని రెండు రోజుల్లో చెల్లిస్తానని చత్రియా హామీ ఇచ్చాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement