ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్(IT)తో సహా కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేసి పొలిటికల్ లీడర్లను టార్గెట్ చేసిందని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఆరోపణలు చేసింది. పరారీలో ఉన్న ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో మనీ లాండరింగ్ కేసులో నవాబ్ మాలిక్‌ను నిన్న ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. ఆయన అరెస్ట్ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర వికాస్ అఘాడీ ప్రభుత్వం కేంద్రంపై దాడిని తీవ్రం చేసింది. రాష్ట్రంలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి కేంద్ర ఏజెన్సీలచే అరెస్టు చేసిన లేదా విచారణలో ఉన్న మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుల జాబితాలో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చేరారు.
అంతేకాకుండా ఇంకా చాలా మంది..
అనిల్ దేశ్‌ముఖ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ: ముంబై మాజీ టాప్ కాప్ పరంబీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలపై ఎన్‌సిపి సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను ఇడి(ED) అరెస్టు చేసింది. తనపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో దేశ్‌ముఖ్ తన హోంమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఏకాంత్ ఖడ్సే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ: పూణె ల్యాండ్ డీల్ కేసులో ఏక్నాథ్ ఖడ్సేను ED ప్రశ్నించింది. మనీలాండరింగ్ ఆరోపణలపై అతని అల్లుడు గిరీష్ చౌదరిని అరెస్టు చేశారు. ఖడ్సే 2020లో బీజేపీ నుంచి ఎన్సీపీలోకి మారారు.
అజిత్ పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో జరిగిన మోసానికి సంబంధించి ED , ఆదాయపు పన్ను శాఖ స్కానర్‌లో ఉన్నారు. అజిత్ పవార్, అతని కుటుంబానికి సంబంధించిన బినామీ ఆస్తులపై కూడా కేంద్ర ఏజెన్సీలు దాడులు చేశాయి. అజిత్ పవార్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు కూడా.
సంజయ్ రౌత్, శివసేన: కేంద్రంపై పార్టీ బహిరంగ విమర్శలకు నాయకత్వం వహిస్తున్న రాజ్యసభ ఎంపీ, భూ ఒప్పందం కేసులో ఇడి లెన్స్ లో ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో ఆయన భార్యను కూడా ఆర్థిక దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. శివసేన అధినేత సమీప బంధువుగా భావిస్తున్న వినాయక్ రౌత్‌ను భూ డీల్ కేసులో ఇడి ఇటీవలే అరెస్టు చేసింది.
ప్రతాప్ సర్నాయక్, శివసేన: రూ.175 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్‌ను ఈడీ విచారిస్తోంది. ఆయనకు సన్నిహితంగా ఉండే పలువురిని కూడా ఈడీ ప్రశ్నించింది.