ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫేర్వెల్ మ్యాచ్లో సానియా మిర్జా విజయం సాధించింది. ఈ మ్యాచ్ అయిపోగానే, ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది సానియా మీర్జా. మ్యాచ్ తర్వాత కంటతడి పెట్టిన సానియా మీర్జా… మీడియాతో మాట్లాడింది. అభిమానుల కోసం చివరి మ్యాచ్ ఆడాను అని తెలిపింది. 20 ఏళ్ల క్రితం నేను ఎక్కడ టెన్నిస్ ప్రాక్టీస్ చేశానో.. అక్కడే ఆఖరి మ్యాచ్ ఆడానని చెప్పింది. ఈ మ్యాచ్ చూసేందుకు నా కుటుంబ సభ్యులు, స్నేహితులు వచ్చారని వివరించారు. కెరీర్లో చివరి మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశానని… విజయంతో కెరీర్ను ముగించాలని అనుకున్నానని పేర్కొన్నారు సానియా మీర్జా. నా కుమారుడు, కుటుంబంతో సమయం కేటాయించాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు సానియా మీర్జా. భావోద్వేగానికి గురై, కంటతడి పెట్టారు.
ఆ తర్వాత అమ్మ గ్రేట్ అంటూ సానియా కొడుకు ఇజహాన్ తల్లిపై ప్రేమను వ్యక్తం చేయడం అందర్నీ ఆకర్షించింది. ఈ మ్యాచ్ కు మంత్రి కేటీఆర్, నటుడు దుల్కర్ సల్మాన్, కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అజారుద్దీన్ లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మ్యాచ్ జరుగుతుండగా యువరాజ్ ను చూసి ఎక్సైటింగ్ గా ఫీలైన అభిమానికి క్యాప్ మీద సంతకం ఇచ్చి యూవీ అనందపర్చారు.