Tuesday, November 26, 2024

స‌మ్మ‌క్క‌, సారాల‌మ్మ ద‌ర్శ‌నానికి వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రి

క‌రోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్నాయి. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ మొద‌టిడోస్ వేసుకున్న‌వారికి ఇక‌పై రెండో డోసు వేయించుకుంటేనే ప్ర‌పంచ‌ప్ర‌ఖ్యాతి గాంచిన మేడారం స‌మ్మ‌క్క‌, సారాల‌మ్మ‌ను ద‌ర్శించుకునేందుకు అనుమ‌తినివ్వ‌నున్నారు. కాగా ఈ జాత‌ర‌కు భ‌క్తులు ల‌క్ష‌లాదిగా దేశం న‌లుమూల‌ల నుంచి త‌ర‌లివ‌స్తుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే వనదేవతల దర్శనం లభిస్తుందని వైద్యాధికారులు వెల్ల‌డించారు. జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్ద వైద్యాధికారులు కరోనా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్‌ నిర్వహించారు.

కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్లు ఆధారాలు చూపిస్తేనే అధికారులు అమ్మవార్ల దర్శనం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ అళ్లెం అప్పయ్య మాట్లాడుతూ..జిల్లాలో మేడారంతో పాటు పర్యాటక ప్రాంతాలైన రామప్ప, బొగత జలపాతం వద్ద ప్రతి ఆది, బుధవారాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కరోనా టీకాల వివరాలు తెలుసుకొని మొదటి డోసు పూర్తయిన వారికి రెండవ డోస్ టీకాతో పాటు ఇప్పటివరకు మొదటి డోసు టీకాలు వేసుకొని వారికి టీకాలు వేస్తున్నట్లు చెప్పారు. టీకాలు వేసుకొని వారిని దర్శనానికి అనుమతించబోమ‌ని స్ప‌ష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement