Thursday, November 7, 2024

Statue Of Equality: సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ప్రోగ్రాం.. Live

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని సమతాస్ఫూర్తి కేంద్రంలో సమతామూర్తి అవతారమైన శ్రీరామానుజాచార్య సహస్రబ్ది సమారోహం సంబురంగా జరుగుతోంది. ఈరోజు సాయంత్రం ప్రధాని మోడీ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కాగా, సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా 5 వేల మంది వేదపండితులతో శ్రీలక్ష్మీనారాయణ మహా మహా యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో ఏర్పాటు చేసిన 144 హోమశాలల వద్ద మహాయాగం నిర్వహించనున్నారు. ఆ మహా యజ్ఞం 14 రోజుల పాటు కొనసాగనుంది.

శ్రీరామానుజాచార్యులు సామాజిక, సాంస్కృతిక, లింగ, విద్య, ఆర్థిక వివక్ష నుంచి లక్షలాది మందికి విముక్తి కల్పించారని చినజీయర్ స్వామీజీ తెలిపారు. జాతీయత, లింగం, జాతి, కుల, మతాలకు అతీతంగా ప్రతి మనిషి సమానమని.. ప్రపంచమంతా ఒకే కుటుంబం, వసుదైక కుటుంబం అనే దృక్పథాన్ని నిలబెడుతూ ఆయన వెయ్యవ జయంతిని సమానత్వపు పండుగగా జరుపుకుంటున్నామన్నారు.

రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో ప్రధానమైనది 216 అడుగుల ఎత్తైన శ్రీరామానుజాచార్య పంచలోహ విగ్రహావిష్కరణ. సమానత్వానికి ప్రతీకగా(స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ఏర్పాటు చేసిన స్వామి వారి విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఆవిష్కరించనున్నారు. కాగా, ఈ నెల 13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమతామూర్తి బంగారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఫిబ్రవరి 14న పూర్ణాహుతి 108 దివ్యదేశాల మూర్తుల ప్రాణప్రతిష్ఠ, శాంతి కల్యాణం జరుగుతాయి.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement