Tuesday, November 26, 2024

స‌మ‌తామూర్తి విగ్ర‌హాల‌ని ఆవిష్క‌రించ‌నున్న మోడీ, రామ్ నాథ్ కోవింద్

రామ‌నుజ‌చార్యుల 1000వ జ‌యంతి సంద‌ర్భంగా 216అడుగుల స‌మ‌తామూర్తిని ఫిబ్ర‌వ‌రి 5వ తేదీని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆవిష్క‌రించ‌నున్నారు. కాగా అదే నెల‌లో 13వ తేదీని స‌మతా మూర్తి లోప‌ల గ‌ర్భాల‌యాన్ని రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ మేరకు చినజీయర్ స్వామి ఆశ్రమం ఓ ప్రకటనను విడుదల చేసింది. హైదరాబాద్ ముచ్చింతల్ లోని చినజీయర్ ఆశ్రమంలో 45 ఎకరాల విస్తీర్ణంలో సమతా మూర్తిని ఏర్పాటు చేయనున్నారు. సమతా మూర్తి ఆవిష్కరణకు అన్ని వర్గాల వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్య అతిథులు, ముఖ్యమైన వ్యక్తులు, భక్తులు, ప్రజలంతా వచ్చి సమతా మూర్తి ఆవిష్కరణను విజయవంతం చేయాలని కోరుతున్నాం. సమానత్వానికి రామానుజచార్యుల వారు వెయ్యేళ్ల పాటు ప్రతీకగా నిలిచారు.

ఆయన బోధనలను మరో వెయ్యేళ్ల పాటు జనాలకు తెలియజెప్పేందుకే ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశామ‌న్నారు.కూర్చుని ఉన్న పొజిషన్ లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహంగా సమతా మూర్తి రికార్డుల్లోకి ఎక్కనుంది. కూర్చుని ఉన్న పొజిషన్ లో అతిపెద్ద విగ్రహంగా థాయ్ లాండ్ లోని బుద్ధుడి విగ్రహం పేరిట రికార్డుంది. రామానుజచార్యుల విగ్రహాన్ని బంగారం, వెండి, రాగి, కంచు, జింక్ వంటి పంచలోహాలతో రూపొందించారు. విగ్రహం లోపల గర్భాలయాన్ని 120 కిలోల బంగారంతో నిర్మించారు. భూమిపై ఆయన 120 ఏళ్లు నడయాడినందుకు గుర్తుగా 120 కిలోల బంగారాన్ని వినియోగించారు. ప్రాజెక్టు కోసం రూ.వెయ్యి కోట్లు వెచ్చిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఇచ్చిన విరాళాలు, చందాలతో దానిని నిర్మిస్తున్నారు. 108 దివ్యదేశాలు, 108 విష్ణు ఆలయాలనూ ఇందులో నిర్మిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement