టాలీవుడ్ కపుల్ సమంత- నాగ చైతన్య జంట విడాకులు తీసుకొని విడిపోవడంపై నేటికి చర్చలు జరుగుతున్నాయి. 2017 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగేళ్ళ తరువాత తమ వైవాహిక జీవితానికి పుల్ స్టాప్ పెట్టారు. ఇటీవల విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ వార్త సినీ ఇండస్ట్రీకి, అభిమానులకు షాక్ కి గురిచేసింది. విడాకుల తరువాత చైతు, సమంత తమ తమ సినిమాలతో బిజీగా మారారు. అయితే, ఎందుకు విడాకులు తీసుకున్నది మాత్రం వెల్లడించలేదు. తాజా సామ్ విడాకుల అంశంపై స్పందించింది. తన విడాకుల తరువాత ఎంత బాధపడింది అనేది బయటపెట్టింది.
ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో సామ్ మాట్లాడుతూ ” మా ఇద్దరి మధ్య జరిగిన చాలా చర్చల తరువాత మేము ఈ నిర్ణయం తీసుకున్నాము.. ఇందులో తప్పు ఎవరిది నేను చెప్పలేను.. కానీ , విడాకులు తీసుకున్నాకా నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నానో నాకు తెలిసింది. విడాకుల తరువాత నేను చనిపోతానేమో అనుకున్నాను.. నేను అంత బలహీనురాలినా అనిపించింది. ఆ తరువాత నా సమస్యలతో నేను పోరాడాను. కృంగిపోకుండా పైకి లేచాను. ఈరోజు నేను ఇంత దృఢంగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను” అంటూ చెప్పింది.