Thursday, September 19, 2024

స‌మంత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు- నాగ‌చైత‌న్య నా మాజీ భ‌ర్త‌-రామ్ చ‌ర‌ణ్ ఒరిజిన‌ల్ గ్యాంగ్ స్ట‌ర్

హీరో నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత త‌న‌కి భ‌ర‌ణంగా రూ.250కోట్లు ఇచ్చిన వార్త‌ల్లో నిజం లేదంది టాలీవుడ్ హీరోయిన్ స‌మంత‌. బాలీవుడ్ ద‌ర్శ‌క‌..నిర్మాత క‌ర‌ణ్ జోహార్ హోస్ట్ చేస్తోన్న షో కాఫీ విత్ క‌ర‌ణ్ లో ప‌లు ప‌ర్స‌న‌ల్ విష‌యాలు తెలిపింది.
ఈ షో ‘డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌’లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఈ షోకు బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్, టాలీవుడ్ హీరోయిన్‌ స‌మంత హాజ‌రైయ్యారు. సామ్‌ ఎపిసోడ్ కోసం టాలీవుడ్ ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఈ ఎపిసోడ్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది..నాగ‌చైత‌న్య‌ని భ‌ర్త అని క‌ర‌ణ్ జోహార్ సంభోదించ‌గా మాజీ భ‌ర్త అని తెలిపింది స‌మంత‌. అంతేకాకుండా ఈ షోలో క‌ర‌ణ్.. రామ్ చ‌ర‌ణ్ గురించి ఒక్క మాట‌లో చెప్పాలని అడుగ‌గా.. దానికి స‌మంత ‘ఒరిజిన‌ల్ గ్యాంగ్‌స్టార్’ అంటూ ట్యాగ్ ఇచ్చింది. వీటితో పాటుగా టాలీవుడ్ నెపోటిజంపై కూడా ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. టాలీవుడ్‌లో చాలా మంది హీరోల పిల్లలు, వారి బంధువుల పిల్లలు మాత్రమే హీరోలు అవుతారు. కానీ విజయ్‌ దేవరకొండ లాంటి వ్యక్తులు స్టార్‌గా మారడం చాలా అరుద‌ని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement