Friday, November 22, 2024

Filmnagar | చైతన్య పేరును పూర్తిగా చెరిపేసింది.. అక్కడుండాల్సిన పచ్చబొట్టుపై సమంత క్లారిటీ!

పచ్చబొట్టు.. ఒక్క‌సారి ఒంటిపై వేసుకుంటే ఇక‌ చెరిగిపోదు అంటుంటారు. కానీ, ఇప్పుడు వ‌చ్చిన కొత్త కొత్త ప్రొడ‌క్టులతో ప‌చ్చ‌బొట్టును కూడా చెరిపేయ‌వ‌చ్చ‌ని రుజువు చేస్తున్నారు కొంత‌మంది బ్యూటీస్‌. త‌న ఒంటిపై అక్క‌డ వేసుకున్న పచ్చబొట్టును చెరిపివేసి.. ఆనవాళ్లు లేకుండా చేసింది హీరోయిన్ సమంత. తాజాగా ఆమె ఫొటో షూట్ లో నెటిజన్లు ఓ అద్భుతాన్ని గమనించారు.

సమంత, నాగ‌చైత‌న్య‌ల అద్భుత‌మైన జోడీ కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకుంది. అయితే.. వారు త‌మ‌కు గుర్తుగా వేసుకున్న టాటూలు మాత్రం ఇంత‌కాలం అలాగే ఉన్నాయి. కానీ, స‌మంత ఈ మ‌ధ్య తాను వేసుకున్న టాటూని తొల‌గించిన‌ట్టు తెలుస్తోంది. త‌న జీవితంలో ఇక‌ నాగ చైతన్యకు చోటు లేదు. ఆయన జీవితంలో ఆమె లేదు. వారి మధ్య ప్రేమ బంధం, పెళ్లి బంధం ఇక లేనే లేదు.. ఇక ఒకరి గురుతులు మరొకరికి ఎందుకు అనుకున్నారో ఏమో.. తన ఒంటిపై చైతన్య పేరును సమంత పూర్తిగా చెరిపేసినట్టు ఫొటోల‌ను గ‌మ‌నిస్తే స్ప‌ష్టం అవుతోంది..

ఇక‌.. సమంత ఒంటిపై మూడు టాటూలు కనిపించేవి. చైతన్యతో కలిసి నటించిన తొలి సినిమా ‘ఏ మాయ చేసావే’కి గుర్తుగా మెడకి కొంచెం కిందకు… వీపు మీద ‘YMC’ అని ఓ టాటూ ఉంటుంది. మరొకటి మణికట్టు మీద ఉంటుంది! బాణం గుర్తు తరహాలో ఉండే ఆ టాటూ రోమన్ సింబల్ అట! డీకోడ్ చేస్తే మ్యారీడ్ డేట్ వస్తుందట! ఆ రెండూ పక్కన పెడితే… సమంత పక్కటెముకలు (రిబ్స్) మీద మరో టాటూ ఉంటుంది. అదే చై అనే అక్షరం.

- Advertisement -

కాగా, సమంత చాలా ఇష్టంగా పెంచుకునే కుక్క రీసెంట్ గా నాగచైతన్య దగ్గర ప్రత్యక్షం అయ్యింది. దాంతో వీరి మధ్య సీక్రేట్ గా బంధం నడుస్తోందంటూ కామెంట్లు వినిపిస్తున్న క్రమంలో సమంత అసలు టాటూ కూడా తీసేసి కనిపించడంతో.. వీరు కలవడం కష్టమని తేలిపోయింది. మరి ఈ విషయంలో నిజా నిజాలు ఏంట‌న్న‌ది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement