Saturday, November 23, 2024

బిగ్ బ్రేకింగ్ః సమంత-నాగచైతన్య విడాకులు

టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంత తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. విడాకులు తీసుకుంటున్నట్లు ఇద్దరు ప్రకటించారు. సమంత, తాను విడిపోతున్నట్లు హీరో నాగచైతన్య ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘పదేళ్ల పాటు స్నేహంగా ఉండి ఒక్కటయ్యాం. అభిమానులంతా అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో స్నేహితులుగా కలిసి ఉంటాం. నాలుగేళ్ల వివాహబంధానికి తెరదించుతున్నాం’ అని నాగచైతన్య ట్విట్టర్ లో పేర్కొన్నారు.

సమంత కూడా అదే ప్రకటనను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. తమ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని ఆశిస్తున్నామని సమంత పేర్కొన్నారు. “అవును… మేం విడిపోతున్నాం. మా దారుల్లో మేం పయనించాలని నిర్ణయించుకున్నాం. ఇది ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం. మా దారులు వేరైనా మా మధ్య ఎప్పటికీ ప్రత్యేకమైన బంధం ఉంటుందని నమ్ముతున్నాం. అభిమానులు, సన్నిహితులు, పాత్రికేయులు మా పరిస్థితిని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. అందరికీ కృతజ్ఞతలు” అంటూ సమంత పేర్కొంది.

కాగా, నాగచైతన్య,సమంత విడాకులు తీసుకున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించని ఈ జంట.. తాజాగా సోషల్ మీడియా వేదికగా విడాకుల విషయాన్ని వెల్లడించారు.

ఇది కూడా చదవండిః హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు.. టీఆర్ఎస్ కు ధీటుగా రేవంత్ స్కెచ్

Advertisement

తాజా వార్తలు

Advertisement