యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ చిత్రంలోని ఒక్క సీన్ కోసం రూ.20కోట్లు ఖర్చు పెట్టారట మేకర్స్. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా శ్రుతిహాసన్ అలరించనుంది. ఈ ఇద్దరి మధ్య లవ్ .. ఎమోషన్ ట్రాక్ నడుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో భయంకరమైన ఒక లోయలో చిత్రీకరించిన ఛేజింగ్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఇక ప్రీ క్లైమాక్స్ కి సంబంధించిన యాక్షన్ సీన్ ను కూడా ఆల్రెడీ చిత్రీకరించారట. ఈ ఒక్క సీన్ కోసం 20 కోట్లవరకూ ఖర్చుచేసినట్టుగా సమాచారం.
Advertisement
తాజా వార్తలు
Advertisement