TSRTC ఎండీగా సజ్జనార్ వచ్చిన తర్వాత అనూహ్యంగా మార్పులు చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియా ద్వారా వెళ్తే ఎంతో పబ్లిసిటీ దక్కుతుందని ఆయన గ్రహించారు. అందుకే పబ్లిసిటీని కొత్తగా ట్రై చేశారు. తమ సంస్థ బస్సుల ఆక్యుపెన్సీ పెంచడం కోసం సజ్జనార్ అనుసరించిన విధానాలు అద్బుతం. తెలంగాణ ఆర్టీసీ వారు కాకుండా మరే రాష్ట్ర ఆర్టీసీ వారు కూడా ఇలా ప్రమోషన్ చేసిన దాఖలాలు లేవు. కోట్లు పెట్టినా రాని పబ్లిసిటీ.. ప్రమోషన్ కాస్త డిఫరెంట్ గా ఆలోచించి సోషల్ మీడియా లో మీమ్స్ ద్వారా ప్రయత్నిస్తే దక్కుతుందని సజ్జనార్ గ్రహించడం నిజంగా అభినందనీయం. ఒక ప్రైవేట్ ట్రావెల్ సంస్థ ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోకు కోట్ల పారితోషికం ఇచ్చి పబ్లిసిటీ చేయించుకుంది. కాని అదే స్టార్ హీరో సినిమా ఫోటోను ఉపయోగించి మీమ్స్ ను క్రియేట్ చేసి ఆర్టీసీ వారు అంతకు మించిన పబ్లిసిటీని దక్కించుకున్నారు. నిజంగా ఈ విషయంలో టీఎస్ఆర్టీసీ ట్విట్టర్ టీమ్ ను అభినందించకుండా ఉండలేం. వారి వెనుక ఉన్న సజ్జనార్ ను ఎంతగా అభినందించినా తక్కువే. ఒక ప్రభుత్వ సంస్థకు ఇంత అగ్రసివ్ గా పబ్లిసిటీ చేయడం ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు. ఏ ఒక్క కొత్త సినిమా వచ్చినా… ఏ ప్రత్యేకమైన సంఘటన వైరల్ సంఘటన జరిగినా కూడా దాన్ని ఉపయోగించుకుని ఆర్టీసీ కి పబ్లిసిటీ చేయడం పరిపాటిగా మారింది. ఇది టీఎస్ ఆర్టీసీకి చాలా ఉపయోగ పడుతుంది. అందరూ సజ్జనార్ ని కొనియాడుతున్నారు.
టిఎస్ ఆర్టీసీ ఎండీగా దూసుకుపోతోన్న సజ్జనార్ – కొత్త కొత్త ప్రయోగాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement