ఆర్మీ హెలికాఫ్టర్ కూలిన ఘటనలో మరణించిన వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ్ కూడా ఉన్నాడు. కాగా ఆయన మృతదేహం స్వగ్రామమైన ఎగువరేగడకు చేరుకుంది. మృతుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా డెడ్‌బాడీని గుర్తించారు. శనివారం నాడు సాయితేజ మృతదేహన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రత్యేక విమానంలో డెడ్‌బాడీని స్వగ్రామానికి తీసుకొచ్చారు. అమర జవాన్ లాన్స్ నాయక్ సాయితేజకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. సాయితేజ భౌతిక కాయాన్ని 30 కి.మీ దూరం ఊరేగింపుగా తీసుకెళ్లారు. సాయితేజ బంధువులు, స్నేహితులు, స్థానికులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.రోడ్డుకు ఇరువైపులా జాతీయ పతాకాలను చేతబూని స్థానికులు సాయితేజ మృతదేహన్ని తిలకించేందుకు స్థానికులు మానవహరంగా ఏర్పడ్డారు. సాయితేజ మరణంతో గ్రామం మూగబోయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..