అయితే.. లేటెస్గ్గా ఆయన ఓ కొత్త సినిమాని ప్రకటించడం విశేషం. సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమాకి సాయితేజ్ చాలా రోజుల క్రితమే కమిట్ అయ్యారు. ఇది ఇప్పటికే పట్టాలెక్కాల్సింది. కానీ సాయితేజ్ బ్రేక్ ఎఫెక్ట్ ఈ చిత్రంపై పడింది. కాగా, సాయిధరమ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. దీనికి గాంజా శంకర్‌గా టైటిల్‌ని ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో సాయిధరమ్ తేజ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన ఫేస్ క్లారిటీ కానీ, లుక్ మాత్రం మాస్‌గా ఉంది. ప్రత్యర్థులను మట్టుపెట్టేందుకు ఆయన ఆయుధాలు పట్టుకుని యాక్షన్‌కి దిగినట్టుగా ఈ ఫస్ట్ లుక్ ఉంది. ఓ వైపు దుమ్ములేస్తుండగా, సాయితేజ్ నోట్లో సిగరేట్‌తో అదరగొడుతున్నారు. ఇక ఇందులో హీరో పాత్రని పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ అదిరిపోయింది. మాస్‌ని వివరించలేం, జస్ట్ ఫీల్ అవ్వాలి ఈ మాసివ్ కాంబో అంటూ ఈ టీజర్ ప్రారంభమైంది.