Tuesday, November 12, 2024

Khammam: సాయి గణేష్‌ ఆత్మహత్య కేసులో.. మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ జలవన్మరణం కేసులో మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆత్మహత్య కేసులో న్యాయవాది కె.కృష్ణయ్య వేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. అధికార పార్టీ వేధింపుల వల్లే సాయి గణేష్‌ ఆత్మహత్య చేసుకున్నారని, ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపాలని పిటిషనర్‌ కోరారు. సాయి గణేష్‌ మృతికి మంత్రి, జిల్లా పోలీసులే కారణమని, ఎనిమిది మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.

కేసు విచారణలో ఉన్నందున తమకు సమయం కావాలని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ మేరకు మంత్రి పువ్వాడతో పాటు ఖమ్మం కార్పొరేటర్‌ భర్త, తెరాస నేత ప్రసన్న కృష్ణ, కేంద్ర, రాష్ట్ర హోంశాఖలు, ఖమ్మం సీపీ, సీఐ సర్వయ్య, త్రీటౌన్‌ ఎస్‌హెచ్‌వో, సీబీఐకి కూడా ధర్మానం నోటీసులిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement