– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆటో రిక్షాలు, క్యాబ్‌లలో ప్రయాణికులకు భద్రత, సౌకర్యాలను కల్పించడం కోసం క్యూ అర్ కోడ్‌ను అమల్లోకి తీసుకువచ్చిన ఎస్పీ అఖిల్ మహాజన్‌ను, పోలీస్ యంత్రాంగాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభినందించారు. ఆటోలు, క్యాబ్‌ల యాజమానుల నుంచి అవసరమైన డాక్యుమెంట్లు, సమాచారం సేకరించి డిజిటలైజ్ చేసి క్యూ ఆర్ కోడ్ రూపంలో తీసుకొచ్చి, ఆ కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు డ్రైవర్ ఫొటో వివరాలతో పాటు.. వాహనానికి సంబంధించిన ఫుల్ డిటెయిల్స్ లభించేలా ఎస్పీ చర్యలు తీసుకున్నారు.
ఇక.. ఎమర్జెన్సీ కాల్ లేదా టెక్స్ట్, ఎమర్జెన్సీ కంప్లెయింట్, రేటింగ్ అనే మూడు రకాల ఆప్షన్‌లు కూడా ఇందులో కనిపిస్తాయి. ప్రయాణికులు సురక్షితం కాదనే పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు కాల్ లేదా టెక్స్ట్ రూపంలో ఫిర్యాదు చేస్తే వాళ్లు ప్రయాణిస్తున్న వాహనం లైవ్ లొకేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు వెళ్తుంది. ఈ విషయాన్ని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమాచారం అందజేస్తారు. డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన, ర్యాష్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, హిట్ అండ్ రన్ చేసిన సందర్భాల్లో అభయ యాప్ ద్వారా కంప్లెయింట్ చేయవచ్చు. ఇట్లా ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరడానికి ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.