ఫేక్ యాడ్స్ కి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు క్రికెటర్ సచిన్ టెండూల్కర్. కాగా
సచిన్ టెండూల్కర్ పేరు, ఫొటో, వాయిస్ ను ఆయన అనుమతి లేకుండానే వాడుకున్న వారిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ముంబైలోని వెస్ట్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్ లో సచిన్ ఫిర్యాదు చేశాడు. ఒక ఔషధ కంపెనీ వారి ప్రాడక్ట్ ను తాను ఎండార్స్ చేస్తున్నట్టు ఫేక్ ప్రకటనలను ఇస్తోందని తన ఫిర్యాదులో సచిన్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ 420 (చీటింగ్), 465 (ఫోర్జరీ), 500 (పరువునష్టం)లతో పాటు ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ యాడ్ పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఫేక్ యాడ్స్ పై పోలీసులకి కంప్లైంట్ చేసిన.. సచిన్
Advertisement
తాజా వార్తలు
Advertisement