Friday, November 22, 2024

Exclusive | రష్యా అంతరిక్ష ప్రయోగం లూనా–25 ​ మిషన్​ ఫెయిల్​.. చంద్రుడిపై క్రాష్​ ల్యాండ్!​

రష్యాకు చెందిన ప్రతిష్టాత్మక చంద్ర మిషన్, లూనా-25, వ్యోమనౌక అదుపు తప్పి చివరికి చంద్రుని ఉపరితలంపై కూలిపోయింది. ఈ విషయాన్ని ఆ దేశ అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ ఇవ్వాల (ఆదివారం) కొద్దిసేపటి క్రితం వెల్లడించింది. లూనా-25 వ్యోమనౌక శనివారం ల్యాండింగ్‌కు ముందు కక్ష్యలో దింపుతుండగా ఫెయిల్​ అయినట్టు తెలుస్తోంది. రోస్కోస్మోస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో మిషన్ కు చెందిన క్లిష్టమైన దశలో అనుకోని సమస్య కారణంగా అంతరిక్ష నౌకతో సంబంధాలు కోల్పోయినట్లు ఏజెన్సీ వెల్లడించింది.

లూనా అనూహ్యమైన కక్ష్యలోకి వెళ్లింది. చంద్రుని ఉపరితలంతో ఢీకొనడంతో అది ప్రస్తుతం ఉనికిలో లేదు అని రోస్కోస్మోస్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆకస్మిక, ఊహించని పరిణామం రష్యా అంతరిక్ష అన్వేషణ ఆశయాలకు గణనీయమైన ఎదురుదెబ్బగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రీయ, అంతరిక్ష పరిశోధకులను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement