రీసెంట్ గా టెహ్రాన్ లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నడుస్తోన్న సందర్భంలో కాస్త బ్యాలన్స్ కోల్పొయారు. దాంతో పెద్ద ఎత్తున వదంతులకు తావిచ్చింది. ఇరాన్ పర్యటనలో పుతిన్ జలుబు బారిన పడినట్టు ఇంటర్ ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. అంతేకాదు పుతిన్ కి కేన్సర్ అని..ఆయన ఆరోగ్యం బాగోలేదనే పుకార్లు షికార్లు చేశాయి. ఇటువంటి తరుణంలో రష్యా అధ్యక్ష కార్యాలయం లోగడ పుతిన్ ఆరోగ్యం బాగానే ఉన్నట్టు ప్రకటించడం గమనార్హం. ఈ పుకార్లకు అమెరికాకు చెందిన విదేశీ గూఢచార సంస్థ సీఐఏ చెక్ పెట్టింది. పుతిన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని సీఐఏ డైరెక్టర్ బిల్ బర్న్స్ చెప్పారు. కాకపోతే తన వ్యాఖ్యలు అధికారిక జడ్జ్ మెంట్ అయితే కాదన్నారు. పుతిన్ ఆరోగ్యంపై ఎన్నో వదంతులు ఉన్నాయి. మా వరకు ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పగలం అని బిల్ బర్న్స్ వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement