రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రాననున్నారు. డిసెంబర్ 6న పుతిన్ ఢిల్లీకి రానున్నారని సమాచారం. ఇరు దేశాల మధ్య జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరవుతారు. పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీతో ఆయన కీలక సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. పుతిన్ పర్యటన కేవలం ఒక్క రోజు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. రష్యా తయారు చేసిన అత్యాధునిక ఎస్400 డిఫెన్స్ సిస్టమ్స్ మన దేశానికి ఈ ఏడాది చివరికల్లా అందనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశం జరగనుండటం విశేషం.
కాగా, 2018లో ఇరు దేశాల మధ్య వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ వచ్చారు. ఆ సమావేశంలోనే ఇరు దేశాల మధ్య ఎస్400 రక్షణ వ్యవస్థ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఆ తర్వాత పుతిన్ భారత్ కు రానుండటం ఇదే తొలిసారి.
ఇది కూడా చదవండి: Zika virus: యూపీని వెంటాడుతున్న జికా.. 100 దాటిన కేసులు