గత 17 రోజులుగా ఉక్రెయిన్ వర్సెస్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ పై రష్యా బాంబులతో భీకర వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్లోని కీవ్ సహా పలు చోట్ల ఎయిర్ రైడ్ సైరన్లు వినిపించాయి. వైమానిక దాడులు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రజలను షెల్టర్లలోకి వెళ్లాలని ప్రభుత్వం సూచించింది. క్విట్నివే ప్రాంతంలో.. గిడ్డంగిలో నిల్వ ఉంచిన ఆహార ఉత్పత్తులు రష్యా దాడులతో చెల్లాచెదురయ్యాయి. కీవ్ ఒబ్లాస్ట్ సహా పలు ప్రాంతాల్లో రష్యా దాడులు చేసింది. వసిల్కివ్లోని ఆయిల్ డిపో ప్రమాదానికి గురైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital