Friday, November 22, 2024

Breaking: ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్పై రష్యా బలగాల బాంబుల వర్షం

నిన్న‌టి ఉద‌యం నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తోంది. రెండో రోజు కూడా ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ లో ఇప్పటి వరకు 83 సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు 13 నగరాలపై దాడులకు దిగిన రష్యా 203 దాడులు చేసింది. అయితే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా బలగాలు మెరుపుదాడులతో విరుచుకుపడుతున్నాయి. కీవ్ లో ఉదయం రెండు భారీ పేలుళ్లు జరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. క్యాపిటల్ సిటీని ఆధీనంలోకి తీసుకునేందుకు ర‌ష్యా సైన్యం ప్రయత్నిస్తోంది. ఆ దిశ‌గా మిలటరీ శిబిరాలు, ఎయిర్ బేస్ లను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతోంది. దీంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా బాంబు దాడిలో కీవ్ నగరంలో రెండు భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement