Thursday, November 21, 2024

పుతిన్ పై మండిప‌డుతోన్న ర‌ష్యా ప్ర‌జ‌లు – ఉక్రెయిన్ పై యుద్ధం ఆపాల‌ని డిమాండ్

ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ చ‌ర్చ‌పై అక్క‌డి ప్ర‌జ‌లు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ పై యుద్ధానికి వ్య‌తిరేకంగా ప‌లువురు ర‌ష్యా ప్ర‌జలు రోడ్డెక్కారు..పుతిన్ కి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఉక్రెయిన్ పై యుద్ధానికి తాము వ్యతిరేకం అని ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించారు. పొరుగు దేశ ఆక్రమణను విరమించుకోవాలని, వెంటనే సైన్యం తిరిగి రావాలని వారు డిమాండ్ చేశారు.
ఉక్రెయిన్‌పై యద్ధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటడంతో ప్రభుత్వం.. పోలీసులను రంగంలోకి దించింది. దేశంలోని 53 పట్టణాల్లో సుమారు 17 వందల మందికిపైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఒక్క మాస్కోలోనే 9 వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో 400 మంది నిరిసన కారులను జైళ్లకు తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement