Tuesday, November 26, 2024

జాపోరిజ్జియా న‌గ‌రంలో కాన్వాయ్ పై ర‌ష్యా బాంబు దాడి-23మంది మృతి-28మందికి గాయాలు

జాపోరిజ్జియా న‌గ‌రంలో కాన్వాయ్ పై ర‌ష్యా బాంబు దాడి చేసిన‌ట్లు స‌మాచారం. ఈ దాడిలో 23మంది ఉక్రెయిన్ పౌరులు మ‌ర‌ణించారు. కాగా 28మంది గాయ‌ప‌డ్డారు. ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియాతో సహా నాలుగు ప్రాంతాలను రష్యాలో చేర్చడంపై ప్రజాభిప్రాయ సేకరణ జరగ్గా.. నేడు అవి అధికారికంగా రష్యాలో విలీనం కానున్నాయి. అయితే, బాంబు దాడి జరగడానికి కారణాలు తెలియరాలేదు. ఫిబ్రవరి 24 నుంచి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుండగా.. ఇప్పటి వరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.రష్యా ఇప్పటివరకు ఉక్రెయిన్‌లోని చాలా ప్రాంతాలను రష్యా ఆక్రమించింది. డొనెట్స్క్, లుహాన్స్క్ (తూర్పు ఉక్రెయిన్), ఖెర్సన్, జపోరిజ్జియా (దక్షిణ ఉక్రెయిన్) రష్యాలో విలీనం కానున్నాయి. ఈ నాలుగు ప్రాంతాల్లో ఉక్రెయి భూభాగంలో 15శాతం ఉన్నాయి. శుక్రవారం నాలుగు ప్రాంతాలు రష్యాలో చేరుతాయని రష్యా పార్లమెంట్‌ ప్రధాన కార్యాలయం క్రెమ్లిన్ తెలిపింది. క్రెమ్లిన్‌లోని సెయింట్ జార్జ్ హాల్‌లో శుక్రవారం జరిగే వేడుకలో నాలుగు ప్రాంతాల అధిపతులు రష్యాలో చేరేందుకు ఒప్పందాలపై సంతకాలు చేస్తారని పెస్కోవ్ గురువారం విలేకరులతో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement