రష్యా దాడిలో ఉక్రెయిన్ లో 300 మంది పౌరులు మృతిచెందారు. ఈరోజు ఉదయం ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్లో సైనిక ఆపరేషన్ చేపట్టనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పౌరులను కాపాడేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే రష్యా యుద్దం ప్రారంభించడంతో ఉక్రెయిన్ లో 300 మంది పౌరులు మరణించారు. 18 ప్రాంతాల్లో రష్యా దాడి చేయడంతో పౌరులు భారీ సంఖ్యలో చనిపోయారు. కీలక ప్రాంతాల్లో ఉక్రెయిన్ తిరుగుబాటు మొదలు పెట్టింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital