Tuesday, November 19, 2024

Russia-Ukraine war: కీవ్ లోకి రష్యా సేనలు.. మరికొన్ని గంటల్లో ఉక్రెయిన్ రాజధాని హస్తగతం

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం వరుసగా 14వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ పై రష్యా బాంబుతో దాడి చేస్తోంది. రాజధాని కీవ్ తూర్పు, సెంట్రల్ రీజయన్లపై బాంబుల వర్షం కురిపించింది. కీవ్ సమీపానికి రష్యా దళాలు చేరుకున్నాయి. మరికొన్ని గంటల్లో కీవ్ రష్యా సేనల చేతుల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 మిలియన్ల మంది ఉక్రెయిన్ పౌరులు దేశాన్ని విడిచిపెట్టారు. వీరిలో అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. అయితే, రష్యా దాడిని ప్రతిఘటిస్తూనే ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తమ పౌరులకు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement