Saturday, November 23, 2024

రష్యా వార్​​: కేంద్ర మంత్రులతో మోడీ భేటీ.. పుతిన్​కు నచ్చజెప్పాలన్నఉక్రెయిన్​ రాయభారి

ఉక్రెయిన్​పై రష్యా గురువారం యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో.. ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అంతకుముందు రష్యా దాడిపై చొరవతీసుకోవాలని భారతదేశంలోని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీని కోరుతూ ఇగోర్ పోలిఖా మాట్లాడారు. ‘‘రష్యాతో భారతదేశానికి ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి. పరిస్థితిని నియంత్రించడంలో న్యూఢిల్లీ మరింత చురుకైన పాత్ర పోషిస్తుంది”అని పేర్కొన్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్​ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని తక్షణమే సంప్రదించాలని మేము ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నాము అని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పోలిఖా అన్నారు. పుతిన్ ఎంత మంది ప్రపంచ నాయకుల మాటలను వింటారో నాకు తెలియదు కానీ, మోడీ జీ స్థితి నాకు ఆశాజనకంగా ఉంది. అతని బలమైన స్వరం కారణంగా, పుతిన్ కనీసం దాని గురించి ఆలోచించగలరు. మేము భారతీయుల నుండి మరింత అనుకూలమైన వైఖరిని ఆశిస్తున్నాము” అని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement