రష్యా – ఉక్రెయిన్ ల యుద్ధం ఎఫెక్ట్ మిగతా దేశాలపై ప్రభావం చూపుతోంది. గత వారం రోజులుగా ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడమే ధ్యేయంగా రష్యా యుద్దం కొనసాగిస్తోంది. ప్రధానమైన నగరాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకెళ్తోంది. అయితే ఈ రెండు దేశాల యుద్ధం ప్రభావం మన దేశంపై కూడా ఉందని చెప్పవచ్చు. ఈ యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధర 118 డాలర్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోంది. రష్యా రూబెల్ రూపాయితో పోల్చితే 70పైసలకు పడిపోయింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital