గత ఆరు రోజులుగా రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ కొనసాగుతోంది. ఉక్రెయిన్ పై రష్యా భయకరంగా బాంబుల వర్షం కురిపిస్తూ… కీలకమైన నగరాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకెళ్తోంది. ఈరోజు తాజాగా…ఉక్రెయిన్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఒకిట్రికా నగరంలోని సైనిక స్థావరంపై రష్యా దాడి చేసింది. ఆ దాడిలో 70 మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందారు. అయితే శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. సుమీ ప్రాంత అధికారి డిమిట్రో జివిస్టికీ పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఒకిట్రికా నగరంలోనే రష్యా సైనికుల మృతదేహాలు కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు ఆయన చెప్పారు. ఆ మృతదేహాలను రెడ్‌క్రాస్‌కు అందిస్తున్నట్లు తెలిపారు. రాజధాని కీవ్, ఖర్కీవ్ మధ్య ఒకిట్రికా సిటీ ఉన్నది.
Advertisement
తాజా వార్తలు
Advertisement