కీవ్ ని టార్గెట్ చేస్తూ రష్యా 15క్రూయిజ్ మిస్సైళ్లని వదిలిందట. అయితే వాటిని కూల్చి వేశామని వెల్లడించింది ఉక్రెయిన్. తమ దేశానికి చెందిన వైమానిక దళం ఆ మిస్సైళ్లను కూల్చినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఈ అటాక్‌లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. కీవ్‌కు చెందిన సీనియర్ మిలిటరీ అధికారి షెరియే పొప్కో ఈ విషయాన్ని చెప్పారు. కాస్పియన్ సముద్ర ప్రాంతం నుంచి నాలుగు బాంబర్ విమానాల ద్వారా ఆ క్షిపణులను రష్యా ప్రయోగించినట్లు ఉక్రెయిన్ అధికారి తెలిపారు. ఆదివారం రాత్రి భారీ స్థాయిలో రష్యా తన డ్రోన్లను లాంచ్ చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. ఉప్పెనలా వచ్చిన డ్రోన్లు, మిస్సైళ్ల వల్ల ఒకరు మృతిచెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు.రష్యా విక్టరీ డే సెలబ్రేట్ చేసుకోవడానికి కొన్ని గంటల ముందే ఈ మిస్సైల్ అటాక్ జరిగినట్లు చెబుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement