Tuesday, November 26, 2024

మెలిటోపోల్ మేయర్ ను విడుదల చేసిన రష్యా

గత 20 రోజులకు పైగా రష్యా వర్సెస్ ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. అయితే రష్యా ఉక్రెయిన్ కు చెందిన ఇద్దరు మేయర్లను కిడ్నాప్ కు పాల్పడిన విషయం విదితమే. అయితే రష్యా ఈరోజు మెలిటోపోల్ మేయర్ ను విడుదల చేసింది. అలాగే ఉక్రెయిన్ 9మంది రష్యన్ సైనికులను వదిలిపెట్టింది. అయినా రష్యా భీకర దాడులు ఆగడం లేదు. తమకు సహకరించడం లేదనే సాకుతో గతవారం మెలిటోపోల్ మేయర్‌‌ను రష్యా సైన్యం అపహరించి ఇటీవల స్వాతంత్రం ప్రకటించిన ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం లుహాన్స్క్‌‌కు తీసుకెళ్లింది. మూడు రోజులు అక్కడ ఉంచిన తర్వాత వేరే ప్రాంతానికి తరలించారు. ఉక్రెయిన్‌ విడుదల చేసిన రష్యా సైనికులు 9 మంది 20 ఏళ్లలోపువారే కావడం గమనార్హం. పౌరులు కచ్చితంగా సైన్యంలో పనిచేయాలనే నిబంధన కింద వీరంతా నియమితులైనవారిగా గుర్తించారు. తమ నిర్బంధంలోని సైనికులు 2002-03 మధ్య జన్మించిన వారే అని ఉక్రెయిన్‌ పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement