రష్యా అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను తిరస్కరించింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్‌ను తక్షణం నిలిపివేయాలని రష్యాను ఆదేశించింది. దాడులు నిలిపేయడంతో పాటు, ఉక్రెయిన్ భూభాగంపై రష్యా సేనలు గానీ, దానికి మద్దతు ఇచ్చే సాయుధ దళాలు గానీ ఎటువంటి తదుపరి ఆపరేషన్లు చేపట్టకుండా చూడాలని స్పష్టం చేసింది. సైనిక చర్య కారణంగా పౌరులు కూడా బాధితులుగా మారుతున్నారని, ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే రష్యా అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను తిరస్కరించినట్లు పేర్కొంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement