రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక రోజు పర్యటన నిమిత్తం నేడు భారత్ రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సోమవారం ద్వైపాక్షిక సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా కీలకమైన రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో మరింత సహకారం కోసం ఇరు దేశాలు పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ప్రధాని మోదీ, పుతిన్ మధ్య ద్వైపాక్షిక సదస్సు ఈ సాయంత్రం ఐదున్నర గంటలకు జరగనుంది. రాత్రి తొమిదిన్నర గంటలకు పుతిన్ రష్యాకు తిరిగి వెళ్లనున్నట్లు విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement