Monday, November 18, 2024

Rescue | రష్యాన్​ స్పేస్​ క్రాఫ్ట్​లో లీకేజీ.. అంతరిక్షంలో చిక్కుకుపోయిన ముగ్గురు ఆస్ట్రోనాట్స్​!

కాస్మోనాట్‌లు సెర్గీ ప్రోకోపియేవ్, డిమిత్రి పెటెలిన్, U.S. వ్యోమగామి ఫ్రాంక్ రూబియోతో కలిసి సెప్టెంబరులో సోయుజ్ MS-22 క్యాప్సూల్‌పై ISS (ఇంటర్నేషనల్​ స్పేస్​ స్టేషన్​) కి వెళ్లారు. వాస్తవానికి వారు మార్చిలో అదే అంతరిక్ష నౌకలో భూమికి తిరిగి రావాల్సి ఉంది.  కానీ, అక్కడ అనుకోని అవాంతరాలు ఎదురుకావడంతో వారిని భూమికి ఎట్లా రప్పించాలనే ఆలోచనణలో రష్యా, నాసా ఆందోళన చెందుతున్నాయి. దీనికి రష్యన్​ స్పేస్​ క్రాఫ్ట్​ సోయుజ్​లో తలెత్తిన లీకేజీనే కారణంగా తెలుస్తోంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

రష్యన్​ స్పెస్​క్రాఫ్ట్​ సోయుజ్​లో తలెత్తిన టెక్నికల్​ ఫాల్ట్​ కారణంగా స్పేస్​ వాక్​ని నిలిపివేసినట్టు తెలుస్తోంది. సోయుజ్ స్పేస్‌క్రాఫ్ట్ లో లీకేజీ కారణంగా రష్యన్ స్పేస్‌వాక్ రద్దు చేశారు. అయితే.. స్పేస్​ క్రాఫ్ట్​ని సరిచేసేందుకు మాస్కో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వ్యోమగాములను పంపడానికి రెస్క్యూ ఆపరేషన్‌ కోసం చేయనున్నట్టు తెలుస్తోంది. సోయుజ్​లో ఉన్న ముగ్గురు వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి రష్యన్ అంతరిక్ష సంస్థ, రోస్కోస్మోస్, ఫ్లయింగ్ ల్యాబ్‌ (ఇంటర్నేషనల్​ స్పేస్​ స్టేషన్​) కు ఎంప్టీ రాకెట్​ని పంపనున్నట్టు తెలుస్తోంది.

ఇక.. రోస్కోస్మోస్, నాసా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోయుజ్ వ్యోమనౌకలో లీక్‌కు కారణాన్ని పరిశోధిస్తున్నామని, జెమినిడ్ ఉల్కాపాతం నుండి లీక్ అయిన వార్తలను వారు తోసిపుచ్చారు. క్యాప్సూల్‌లోని ముగ్గురు సిబ్బందిని తిరిగి భూమికి తీసుకువచ్చే కచ్చితమైన మార్గాల గురించి ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. వాళ్లను తిరిగి తీసుకురావాలంటే మరొక సోయుజ్‌ని పంపడ కానీ, లేదా ఎక్కువ శీతలకరణ లేకుండా లీకేజీ క్యాప్సూల్‌లో ఇంటికి తీసుకొచ్చే మార్గాలున్నాయని చెప్పారు. అయితే దీనికి చాలా తక్కువ తక్కువగా అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -

అవసరమైతే మార్చిలో పంపాల్సిన సోయుజ్ తదుపరి షెడ్యూల్ ప్రయోగాన్ని వేగవంతం చేయవచ్చని రష్యా ఇప్పటికే సూచించింది. తదుపరి సోయుజ్ అంతరిక్ష నౌక, సోయుజ్ MS-23, గతంలో షెడ్యూల్ చేసిన మార్చి ప్రయోగానికి సన్నాహకంగా ఇప్పటికే కొన్ని పరీక్షలను నిర్వహించినట్టు రోస్కోస్మోస్  చెప్పింది. అవసరమైతే ప్రయోగాన్ని వేగవంతం చేయవచ్చని తెలిపింది. రోస్కోస్మోస్ డైరెక్టర్ యూరి బోరిసోవ్ విలేకరులతో మాట్లాడుతూ.. అంతరిక్ష రాకెట్​ పరిస్థితిని నిపుణులు విశ్లేషించి, డిసెంబర్ 27 నాటికి ఎలా కొనసాగాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సోయుజ్‌లో రంధ్రం కేవలం 0.8 మిల్లీమీటర్లు (0.03 అంగుళాలు) మాత్రమే ఉందని ఆయన చెప్పారు.

డిసెంబర్ 14న జరిగిన ఈ లీక్ కారణంగా మాస్కోలోని మిషన్ కంట్రోలర్‌ నుంచి స్పేస్‌వాక్‌ను నిలిపివేయాలని ఆదేశించినట్టు సమాచారం. అయితే.. ప్రత్యక్ష NASA వెబ్‌కాస్ట్​ తెలిపిన ప్రకారం.. సోయుజ్ స్పేస్‌క్రాఫ్ట్ వెనుక నుండి స్నోఫ్లేక్ లాంటి రేణువులను చిమ్ముతున్నట్లు కనిపించింది. ఈ లీకేజీ గంటలపాటు కొనసాగింది.  వ్యోమనౌక సిబ్బంది కంపార్ట్ మెంట్ లోపల ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి ఉపయోగించే శీతలకరణి యొక్క రేడియేటర్‌  ఈ లీకేజీ కారణంగా ఖాళీ అయినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement